: రాజ్ భవన్ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ మనవరాలి పాఠాలు


హైదరాబాదులోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ మనవరాలు శరణ్య పాఠాలు చెప్పారు. రెండో తరగతి విద్యార్థులకు ఆమె పాఠాలను బోధించారు. శరణ్య ఇటలీ దేశంలో చదువుతున్నారు. అక్కడ పాఠశాలకు సెలవులు కావడంతో, ఆమె నగరానికి వచ్చారు. తన నాయనమ్మ విమలా నరసింహన్ తో కలసి నిన్న పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఆమె పాఠాలు చెప్పారు. దాదాపు రెండు గంటలపాటు ఆమె పాఠశాలలోనే గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత మాట్లాడుతూ, శరణ్య వారం రోజుల పాటు పాఠశాలకు వస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News