: వైఎస్సార్సీపీ దద్దమ్మల పార్టీ: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
పార్టీ పూర్తి పేరు చెప్పుకోలేని వారు తమపై విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్సాఆర్ అంటే..యువజన శ్రామిక రైతు పార్టీ అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదని అన్నారు. కాంగ్రెస్ పై నోరుపారేసుకుంటున్న వైఎస్సార్సీపీ దద్దమ్మల పార్టీ అని, తమ పార్టీ అధినేత్రి సోనియాను విమర్శించే హక్కు భూమన కరుణాకర్ రెడ్డికి లేదని అన్నారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేసుకున్నారు.