: పేకాట ఆడుతూ పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు!
పేకాట ఆడుతూ రెవెన్యూ అధికారులు పట్టుబడ్డ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. నేలకొండపల్లి మండలం చెరువుమాదారం సమీపంలోని ఓ ఫాంహౌస్ లో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో ఆర్డీవో భాస్కర్ రావు, ఆర్ఐ కిరణ్ రావు, సత్తుపల్లి డీటీ వనమా కృష్ణప్రసాద్, డీఆర్డీఏ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఖమ్మం రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు ఉన్నారు. పరారైన మరికొందరు అధికారులపై కేసు నమోదు చేశారు.