: ఏపీ ప్రభుత్వానికి డబ్బు సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోంది: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఏపీలో మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వానికి డబ్బు సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖపట్టణంలోని మాధవధార, కళింగనగర్, కైలాసపురంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా నిర్వహించిన స్థానికుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, జనావాసాల మధ్య వైన్ షాపులు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.