: జగన్ కు సోనియా చేసిన అన్యాయాన్ని మర్చిపోం.. కాంగ్రెస్ పార్టీ ఓ ఈజిప్ట్ మమ్మీ: భూమన


వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ లేఖ రాసిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రఘువీరా లేఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కూడా ఒక లెటర్ హెడ్ ఉందనే విషయం తెలిసిందని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోనియాగాంధీ కుమ్మక్కై జగన్ ను జైలుకు పంపిన విషయాన్ని ఎవరూ మర్చిపోరని అన్నారు. అన్యాయంగా జగన్ ను జైలుకు పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దని చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో మీరాకుమార్ స్పీకర్ గా ఉన్నారని... అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎందుకు మద్దతు ఇవ్వాలని నిలదీశారు.

కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత రాజశేఖరరెడ్డిదని భూమన అన్నారు. వైయస్ పేరును ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్ కు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఈజిప్టు మమ్మీకి తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తమకు సలహా ఇచ్చే స్థాయి కాంగ్రెస్ కు లేదని అన్నారు.


  • Loading...

More Telugu News