: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు
ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నేడు భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో, ప్రాణ భయంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు, ఏల్చూరు, పరిటాలవారి పాలెంలో భూమి కంపించింది. గుంటూరు జిల్లాలో శావల్యాపురం, పొట్లూరు, కిష్టాపురంలో ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలు తరచుగా సంభవిస్తుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.