: బాహుబలి టీమ్ కు క్షమాపణలు చెప్పిన గౌతమి
'బాహుబలి' సినిమా టీమ్ సభ్యులకు సీనియర్ నటి గౌతమి క్షమాపణలు చెప్పారు. ఇంత వరకు తాను ఈ సినిమాను చూడలేకపోయానని అన్నారు. సినిమాను చూడాలి అని చాలా సార్లు అనుకున్నానని... అయితే, తన కుమార్తె పరీక్షలు జరుగుతుండటంతో సినిమాను చూడలేకపోయానని చెప్పారు. సినీ పరిశ్రమలో దశాబ్దాల నుంచి ఉన్న మార్కెట్ పరిధులను ఈ సినిమా చెరిపేసిందని ఆమె అన్నారు. ఒక ప్రాజెక్ట్ ను సరైన రీతిలో హ్యాండిల్ చేయగలిగితే ఫలితం ఎలా ఉంటుందో రాజమౌళి చేసి చూపించారని తెలిపారు. వాస్తవానికి తనకు సినిమాకు వెళ్లే అలవాటు లేదని ఆమె చెప్పారు.