: బంజారా హిల్స్ లో నానా హంగామా చేస్తోన్న ఎంఐఎం ఎమ్మెల్యే.. ఉద్రిక్త పరిస్థితి
హైదరాబాద్‌లోని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో హల్‌చల్ చేస్తున్నారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. అందులో భాగంగా ఈ రోజు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అక్రమంగా నిర్మించిన 300 మీటర్ల గోడను కూల్చి వేస్తున్నారు. అధికారుల పనికి ఎవ్వరూ అడ్డుతగలకుండా చూసుకునేందుకు పోలీసులు కూడా వచ్చారు. అయితే, ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కౌసర్ వెంటనే అక్కడకు చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులను తన మనుషులతో బెదిరించడానికి ప్రయత్నించారు.
మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో అధికారులు తాము కమిషనర్ ఆదేశాల ప్రకారమే కూల్చివేస్తున్నామని చెప్పారు. అయినా వినిపించుకోకుండా సదరు ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.