: క్వీన్ ఎలిజబెత్ సహాయకుడి పాత్ర కోసం 600 కాస్ట్యూమ్స్ రూపొందించారు!
సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో సన్నివేశాలకు తగ్గ వేషధారణ కూడా అంతే ముఖ్యం. సన్నివేశాలు బాగా పండాలంటే ఆయా పాత్రలు ధరించిన కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సామ్రాజ్ఞి ఎలిజబెత్ కథ ఆధారంగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ కథలో రెండు కీలక పాత్రలు ఉన్నాయి. ఒకటి క్వీన్ ఎలిజబెత్ కాగా, రెండవ పాత్ర కథలో కీలకమైనది. క్వీన్ పని మనిషైన ఇండియన్ పాత్ర. ఈ సినిమా పేరు 'విక్టోరియా అండ్ అబ్దుల్' మహారాణికి సేవలు చేసేందుకు భారత్ లో ఉన్న బ్రిటిష్ అధికారులు అబ్దుల్ అనే వ్యక్తిని సహాయకుడిగా పని చేసేందుకు లండన్ పంపిస్తారు. విక్టోరియాకు సేవలందించే అబ్దుల్ ఆమెకు స్నేహితుడిగా, గురువుగా మారిపోతాడు. వారిద్దరి మధ్య సాగే అనుబంధమే ఈ సినిమా. ఈ కథ 18వ శతాబ్దం నాటిది.
అయితే క్వీన్ ఎలిజబెత్ పాత్ర గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ సినిమాలో ఆ పాత్రధారి జుడి డెంచ్ పాత్రకు కాస్ట్యూమ్స్ డిజైనర్లు సులువుగానే దుస్తులు రూపొందించారు. అయితే ఆమె సహాయకుడి పాత్ర పోషిస్తున్న భారతీయ నటుడు అలీ ఫజల్ కోసం మాత్రం కాస్ట్యూమ్స్ డిజైనర్లు తీవ్రంగా శ్రమించారు. ఆస్కార్ కి నామినేట్ అయిన ఐర్లాండ్ కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ కాన్సొలాటా బొయిల్ కు కాస్ట్యూమ్స్ బాధ్యతను అప్పగించగా, భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్లు రాఘవేంద్ర రాథోడ్, ఉజ్వల్ దూబే సాయంతో మూడు నెలలపాటు 600 కాస్ట్యూమ్స్ తయారు చేశారు. ఎట్టకేలకు అతనికి సరిపడా దుస్తులు తయారు చేశారు. దూబే పేరు సూచించింది, అబ్దుల్ పాత్రధారి అలీ ఫజల్ కావడం విశేషం.