: పాక్ బ్యాట్స్ ఉమన్ ను నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తిస్తున్న భారత్ బౌలర్లు... 9 ఓవర్లకి 16/4


170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ బ్యాట్స్ ఉమన్ ను భారత్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో 6 ఓవర్లలో కేవలం 9 పరుగులకే 3 కీలక వికెట్లను తీసి సత్తాచాటారు. పాక్ బ్యాటింగ్ ను ఆయేషా జఫర్ (1), నహీదా ఖాన్ (6) ప్రారంభించారు. అయేషాను ఎక్తా బిస్త్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దీంతో కేవలం ఒక్క పరుగుకే పాక్ ఒక వికెట్ కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన జవేరీ ఖాన్ (6) ను జులన్ గోస్వామి వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దీంతో 8 పరుగుల వద్ద పాక్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సిద్రా నవాజ్ (0) ను ఎక్తా బిస్త్ అద్భుతమైన బంతితో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఇరమ్ జావెద్ (0) ను మరో అద్భుతమైన బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపింది. దీంతో క్రీజులో నహీదా ఖాన్ కు జతగా నైన్ అబిది క్రీజులో ఉంది. దీంతో 9 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఎక్తా బిస్త్ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరవగా, ఒక వికెట్ తో స్టార్ బౌలర్ జులన్ గోస్వామి ఆకట్టుకుంది. 

  • Loading...

More Telugu News