: మరో సాహసం చేసిన హీరో విశాల్.. కావేరీ జలాలు విడుదల చేయాలంటూ లేఖ!


ప్రముఖ నటుడు విశాల్ బెంగళూరు నడిబొడ్డున కావేరీ జలాల గురించి మాట్లాడి ధైర్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అదే ధైర్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. కావేరీ నదీ జలాలను విడుదల చేయాలంటూ కర్ణాటక నీటి పారుదలశాఖ మంత్రికి లేఖ రాశాడు. బెంగళూరులో ఒక సినిమా ఆడియో వేడుకకు వెళ్లిన విశాల్ అక్కడ కావేరీ జలాల గురించి మాట్లాడి అందర్నీ అవాక్కయ్యేలా చేసిన సంఘటన నుంచి తేరుకోకముందే... మనమంతా భారతీయులమని, జూన్ 12 నాటికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను ఇంకా విడుదల చేయలేదని ఆ లేఖలో గుర్తు చేశాడు.

కావేరీ జలాలను విడుదల చేయని కారణంగా తమిళనాడు ప్రజలు తాగు, సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణం నీటిని విడుదల చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. కాగా, కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం ఏళ్ల తరబడి సాగుతున్న సంగతి తెలిసిందే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నరీతిలో నీటిని నిల్వ ఉంచితే తమిళులకు కోపం వస్తుంది, నీటిని విడుదల చేస్తే కర్ణాటక రైతులకు కోపం. దీంతో ఈ వివాదం రేగిన ప్రతిసారీ పెనువిధ్వంసం జరుగుతుంటోంది. 

  • Loading...

More Telugu News