: శిరీష కేసులో పోలీసులు, మీడియా చెబుతున్న కథనాలు మేక-కుక్క కథను తలపిస్తున్నాయి: శిరీష పిన్ని


శిరీష కేసులో పోలీసులతో పాటు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్న కథనాలు మేక-కుక్క కథను తలపిస్తున్నాయని శిరీష పిన్ని వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, ఒక గురువు గారు మేకను తీసుకెళ్తుంటే ఒకరు కనిపించి ఏంటి గురువుగారూ కుక్కను తీసుకెళ్తున్నారు? అంటూ అడిగాడట... ఆయన ముందు కెళ్తే మరో వ్యక్తి కూడా అలాగే అడిగాడు. మరి కొంచెం ముందుకెళ్తే మరో వ్యక్తి నుంచి అదే ప్రశ్న ఎదురైంది.

అయితే పది మంది అడిగేసరికి తాను పట్టుకెళ్తున్నది మేకా? కుక్కా? అన్న అనుమానం వచ్చి చూసుకుని, చివరికి అది కుక్కే అని భ్రమించి దానిని వదిలేశాడట... శిరీష కేసు కూడా అలాగే ఉందని ఆమె అన్నారు. శిరీష ఆర్జే స్టూడియోలో నాలుగేళ్ల నుంచి పని చేస్తోందని అందరూ చెబుతున్నారని, అది అబద్ధమని ఆమె స్పష్టం చేశారు. కేవలం నాలుగు నెలల ముందే ఆమె అక్కడ జాయిన్ అయ్యారని ఆమె చెప్పారు. రాజీవ్ ని తేజస్విని పెళ్లి చేసుకుంటే శీరిష ఎందుకు అభ్యంతరం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ అలా చెప్పేదే అయితే రాజీవ్ కు సంబంధం చూడమని తమకు ఎందుకు చెబుతుందని ఆమె అడిగారు. 

  • Loading...

More Telugu News