: భారత్ టాప్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించిన పాక్


ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే ఆసక్తికరంగా జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టుకు ఆదిలోనే స్మృతి మందాన (2) ను అవుట్ చేసి పాక్ బౌలర్లు ఆకట్టుకోగా, పూనమ్ రౌత్ (47), దీపాలి శర్మ (28) జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరు అర్ధసెంచరీ దాటించారు. అనంతరం మంచి జోరుమీదున్న పూనమ్ ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి పెవిలియన్ కు పంపింది.

అనంతరం దీపాలి శర్మకు కెప్టెన్ మిథాలీ రాజ్ (8) జత కలిసింది. తొలి బంతినే బౌండరీకి తరలించిన మిథాలీ క్రీజులో కుదురుకునేలోపే మరో అద్బుతమైన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అదే ఓవర్ లో దీపాలి కూడా కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దీంతో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన టీమిండియా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో 30 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత మహిళా జట్టు 99 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నస్రా సంథు మూడు వికెట్లతో రాణించగా, డైనా బేగ్ ఒక వికెట్ తో ఆకట్టుకుంది. 

  • Loading...

More Telugu News