: గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే... చోద్యం చూస్తూ వీడియో తీసిన స్థానికులు


పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన చోరా సుబ్రహ్మణ్యం తన కుటుంబ సభ్యులతో కలిసి బుక్కా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా మండలంలో కలవచర్ల గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గాంధీ బొమ్మసెంటర్లో పూటుగా మద్యం తాగిన సుబ్రహ్మణ్యం తాగిన మైకంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీంతో అతని గొంతు నుంచి రక్తం చిమ్మింది. రోడ్డుపై రక్తం ధారలు కట్టింది.

దారిన పోయేవాళ్లంతా దీనిని చోద్యం చూస్తున్నట్టు చూశారే కానీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పోనీ కనీసం గాయపడిన తరువాత అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ దారుణాన్ని పలువురు వీడియోగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రోడ్డు మీద తీవ్ర రక్తస్రావం కావడంతో సుబ్రహ్మణ్యం అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని తెలుసుకున్న ఎస్సై రాజేష్ అక్కడికి చేరుకుని, సిబ్బంది సాయంతో అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండగా, మెలకువ వచ్చిన తరువాత తనకు మద్యం కావాలంటూ పోలీసులు, వైద్యులను కోరడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.

  • Loading...

More Telugu News