: 'నైన్టీ బాటిల్ రూ. 150 అంటున్నారు': విజయవాడ మద్యం దుకాణాల్లో ఎన్నడూ లేనంత డిమాండ్


ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, కొత్త వైన్స్ షాపుల ప్రారంభానికి పలు ఆటంకాలు ఏర్పడటంతో, మద్యం ఉత్పత్తులకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఈ ఉదయం విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వైన్స్ షాపులు తీసీ తీయగానే మందుబాబులు ఎగబడ్డారు. సినిమా థియేటర్ ముందు టికెట్ కోసం తన్నుకునే ప్రేక్షకుల మాదిరి వైన్స్ షాపు ముందు చేరడంతో, వారిని అదుపు చేసేందుకు యాజమాన్యం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

స్టాకులు పరిమితంగా ఉండటం, కొద్ది షాపులు మాత్రమే తీయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక వైన్స్ షాపుల్లో నైన్టీ బాటిల్ ను రూ. 150కి విక్రయించి దోచుకుంటున్నారని మందు ప్రియులు ఆరోపిస్తున్నారు. రూ. 110 ధర ఉండే క్వార్టర్ బాటిల్ ధరను రూ. 170కి అమ్ముతున్నారని తెలిపారు. తాము గంటన్నరగా ఇక్కడే ఉన్నా ఇంకా తమకు కావాల్సింది దొరకలేదని మరో వ్యక్తి వాపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, కస్టమర్లను ఓ లైన్ లో నిలిపే ప్రయత్నాలు చేశారు. పరిస్థితి ఇంకా సద్దుమణగ లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News