: కోహ్లీని ఎద్దేవా చేసిన ఇంగ్లండ్ కామెంటేటర్ డేవిడ్ లాయిడ్... ముందు మీ సంగతి చూసుకోండని నెటిజన్ల క్లాస్!
కోహ్లీతో వచ్చిన విభేదాల కారణంగా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన ఘటనను గుర్తు చేస్తూ, కోచ్ లేనందునే కోహ్లీ దారుణంగా అవుట్ అయ్యాడని ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ విమర్శించాడు. శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో ఇండియా 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, కోహ్లీ మాత్రం 11 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే.
కోహ్లీ వైఫల్యంపై లాయిడ్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ముందు మీ సొంత జట్టు సంగతి చూసుకోవాలని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. పెద్ద టోర్నీలో ఇంగ్లండ్ విఫలమవడాన్ని అలవాటుగా చేసుకుందని ఎద్దేవా చేస్తున్నారు. కోహ్లీని ప్రసన్నం చేసుకుంటే కోచ్ పదవికి అవకాశం దక్కుతుందని సలహాలు ఇస్తున్నారు.