: రోజూ తాగి వచ్చి కొడుతున్నాడు: తమిళ బుల్లితెర నటుడు బాలాజీపై భార్య నిత్య ఫిర్యాదు
తన భర్త నిత్యమూ తాగి వచ్చి హింసిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తమిళ నటుడు, టెలివిజన్ కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న 'దాడి' బాలాజీపై ఆయన భార్య నిత్య చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెతో సహా సీపీ కార్యాలయానికి వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, గత నెలలో బాలాజీ తనను కొడితే, పెద్ద గాయమైందని, తాను ఇప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది.
బాలాజీకి, తనకు వయసులో 15 సంవత్సరాల వ్యత్యాసం ఉందని పెళ్లి తరువాతే తనకు తెలిసిందని, తాను ఉద్యోగం చేస్తుంటే, ఆఫీసుకు వచ్చి గొడవ చేశాడని, తనను అనుమానిస్తూ చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. మొదటి భార్యలాగానే తాను కూడా అతన్ని వదిలేసి వెళతానన్న భయంతోనే ఇలా చేస్తున్నట్టు అనుమానంగా ఉందని తెలిపింది.