: ‘మెంటల్‌ మదిలో’ సినిమాలోని ‘గుమ్మడికాయ హల్వ’ పాటను విడుదల చేసిన హీరో నాని


రాజ్‌ కందుకూరి నిర్మిస్తోన్న ‘మెంటల్‌ మదిలో’ సినిమాలోని ‘గుమ్మడికాయ హల్వ’ పాట ఈ రోజు టాలీవుడ్ యంగ్‌ హీరో నాని చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు, నివెత పెతురాజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌న‌ప‌డుతున్నారు. త‌న సినిమా ‘పెళ్లి చూపులు’కి  సైమా అవార్డు లభించ‌డంతో ఆ అవార్డు స్వీకరించడానికి అబుదాబికి వెళ్లిన‌ రాజ్‌ కందుకూరి అక్క‌డే ఉన్న నానిని క‌లుసుకొని ఈ పాట విడుదల చేయించారు. తాను ఈ సినిమా టీజర్‌ను చూశానని, అది త‌న‌కు ఎంత‌గానో నచ్చింద‌ని అన్నాడు. త‌న చేతుల మీదుగా విడుదలైన పాట కూడా చాలా బాగుంద‌ని కితాబిచ్చాడు. తాను గత ఏడాది ‘పెళ్లి చూపులు’ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశానని అన్నాడు. ఈ నెల చివరి వారంలో ‘మెంటల్‌ మదిలో’ సినిమా విడుద‌ల కానుంది. 

  • Loading...

More Telugu News