: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 19 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్కాన్సస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ సిటీలో గల ఓ నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దాదాపు 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నైట్‌క్లబ్, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అలజడి చెలరేగడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఆ క్లబ్‌లో ఇరు వర్గాలు గొడవపడ్డాయని, ఈ వాతావరణమే కాల్పులకు దారితీసిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఇంకా గుర్తించలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.