: వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని... గుజరాత్‌లో కేటీఆర్ రెండో రోజు పర్యటన
గుజరాత్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెండో రోజు కూడా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. ఈ రోజు సబర్మతి నది అభివృద్ధి నమూనాపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తాము మహాత్మ గాంధీ చూపిన బాటలోనే అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్వరాజ స్థాపనే మహాత్ముడి ఆశయమని అన్నారు. సబర్మతీ నది అభివృద్ధి పనులను పరిశీలించే క్రమంలో వర్షం ఆటంకిగా మారగా అధికారులతో కలిసి కేటీఆర్ గొడుగు పట్టుకుని మరీ పనులను పరిశీలించారు.