: విద్యార్థులు తమతో తుపాకులు తెచ్చుకోవడానికి అక్కడ అనుమతులు ఇచ్చేశారు!
అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో తుపాకులను ఉపయోగించే అంశంపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇకపై అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా గన్‌ను ఉపయోగించవచ్చు. అయితే, ఈ కొత్త చట్టంపై అధ్యాపకులు మండిపడుతున్నారు. కన్సాస్ లోని పలు యూనివర్సిటీల అధ్యాపకులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని చెప్పారు. ఆయుధాలు వెంట తెచ్చుకునే విద్యార్థులకు తాము పాఠాలు బోధించలేమని స్పష్టం చేశారు.
అమెరికాలో దుండగుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎవరికి పడితే వారికి తుపాకులు ఇచ్చేసేవారు. అయితే, గన్ కల్చర్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియా, దక్షిణ కరోలినా సహా 16 రాష్ట్రాలు ఈ విధానానికి చరమగీతం పాడాయి. అర్కాన్‌సస్, జార్జియాతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు తమ వెంట గన్‌లు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది.