: మహానాడుకు ఎందుకు రాలేదో చంద్రబాబుకు వివరించిన రామసుబ్బారెడ్డి
అలకపాన్సును ఎక్కిన కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఈ రోజు చంద్రబాబును కలిశారు. అమరావతిలో తమ అధినేతతో భేటీ అయ్యారు. మంత్రి ఆదినారాయణరెడ్డితో తనకు ఉన్న ఇబ్బందులను ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు, విశాఖలో జరిగిన మహానాడు కార్యక్రమానికి తాను ఎందుకు హాజరుకాలేకపోయారో అధినేతకు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ పై రామసుబ్బారెడ్డికి చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.