: లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాషిర్ లష్కరిని మట్టుబెట్టిన భారత సైన్యం
అనంత్ నాగ్ లో ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులకు, భారత భద్రతా బలగాలకు ఈ రోజు హోరాహోరీ కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఇంటిని చుట్టుముట్టిన భారత సైన్యం లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాషిర్ లష్కరిని మట్టుబెట్టింది. గతంలో ఈ ఉగ్రవాదిపై కశ్మీర్ పోలీసులు 10 లక్షల నజరానా ప్రకటించారు. బాషిర్ ఆధ్వర్యంలో గతనెల 17న జరిగిన ఓ దాడిలో ఏడురుగు పోలీసులు మృతి చెందారు. సోప్‌సాలి కోకర్‌నాగ్ ప్రాంతానికి చెందిన బాషిర్ లష్కరి 2015 అక్టోబర్ 2న ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ రోజు ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.