: బాలసుబ్రహ్మణ్యం చాలా అల్లరివాడు... అతనివి ఎగస్ట్రా 'సంగతులు'!: ఎస్.జానకి


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా అల్లరివాడని ప్రముఖ గాయని ఎస్.జానకి గుర్తుచేసుకున్నారు. 'బాలు తాను పాటలు పాడుతూ బిజీగా ఉన్న సమయంలో ఫిమేల్ ట్రాక్, మేల్ ట్రాక్ వేర్వేరుగా పాడించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో బాలు ముందుగా వచ్చి పాటపాడేసి వెళ్లిపోయేవాడు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన సంగతుల కంటే రెండు మూడు సంగతులు కలిపి పాడేసేవాడు. దీంతో బాలు పాడినట్టే మేము కూడా పాడాల్సి వచ్చేది' అని ఆమె చెప్పారు.

దీంతో రికార్డింగ్ ధియేటర్ లో అందరూ 'బాలులా పాడడానికి ప్రయత్నిస్తోంది చూడు' అంటూ అనుకునేవారని గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా బాలు తను వేసిన సంగతులు తాము పాడకుండా అడ్డుకునేవాడని, అందుకోసం తాను రికార్డింగ్ లో ఉన్న సమయంలో ఎదురుగా గది బయట నిల్చుని కోతి చేష్టలు చేసేవాడని, దీంతో తాను నవ్వుకునే దానినని, దీంతో పాట బాలు అనుకున్నట్టే వచ్చేదని, దీంతో బాలు పక్కకి వెళ్లి... 'జానకి గారేంటి అలా పాడుతున్నారు?' అంటూ అనేవాడని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రికార్డింగ్ కు తన భర్త కూడా వెంట వచ్చేవారని, ఆయన 'అదేంటి నీకు పాడడం రాదా? సరిగ్గా పాడవచ్చుకదా?' అంటూ తిట్టేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News