: వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పుట్టినరోజు నేడు. 1949 జూలై 1న నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో ఆయన జన్మించారు. ఆయన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఎంతో కార్యదక్షత కలిగిన వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని, సంపూర్ణ ఆయుష్షును భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.