: తన పేరిట మొబైల్ యాప్ ను విడుదల చేసిన రవీంద్ర జడేజా


టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన పేరిట మొబైల్ యాప్ ను విడుదల చేశాడు. ఈ యాప్ కు అమెరికాకు చెందిన ఎస్కేప్ ఎక్స్ అనే సంస్థ సాంకేతిక సహకారం అందించింది. ఈ సందర్భంగా జడేజా మాట్లాడుతూ, యాప్ విడుదల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన అభిమానులతో మాట్లాడేందుకు, తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంచేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇండియన్ క్రికెటర్లలో సొంత యాప్ ను తీసుకొచ్చిన తొలి ఆటగాడు జడేజానే కావడం విశేషం.

  • Loading...

More Telugu News