: బీడబ్ల్యూఎఫ్ మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత్.. టాప్ 100లో అత్యధికమంది భారత షట్లర్లు!


భారత షట్లర్లు మరోమారు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మెన్స్ సింగిల్స్ ర్యాంక్సింగ్స్‌లో అత్యధిక మంది భారత షట్లర్లకు చోటు లభించింది. టాప్ 100లో 14 మంది భారత ఆటగాళ్లకు చోటు దొరికింది. అదే సమయంలో ఏడుగురు మహిళా షట్లర్లు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించారు. మహిళల్లో సైనా నెహ్వాల్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధులతోపాటు మరికొందరికి టాప్ ప్లేస్ లభించింది. పురుషుల్లో కిదాంబి శ్రీకాంత్, బి.సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణోయ్ తదితరులు ర్యాంక్సింగ్ జాబితా కెక్కారు.

మెన్స్ సింగిల్స్ టాప్-100 ర్యాంకింగ్స్‌లో మనోళ్ల స్థానాలు

ఆస్ట్రేలియన్ ఓపెన్ కొల్లగొట్టిన కిదాంబి శ్రీకాంత్‌ 8వ స్థానంలో నిలవగా బి.సాయి ప్రణీత్ 15, అజయ్ జయరామ్ 16, హెచ్ఎస్ ప్రణోయ్ 23, సమీర్ వర్మ 33, సౌరభ్ వర్మ 35, పారుపల్లి కశ్యప్ 60, ప్రతుల్ జోష్ 66, శుభంకర్ డే 73, సిరిల్ వర్మ 80, ఆనంద్ పవార్ 86, అభిషేక్ యెలెగర్ 89, హర్షీల్ దాని 96, ఆదిత్య జోషి 98 స్థానాల్లో నిలిచారు.

మహిళల్లో పీవీ సింధు 5వ స్థానంలో నిలవగా, సైనా నెహ్వాల్ 15, రితుపర్ణ దాస్ 47, తన్విలాడ్ 63, గద్దె రుత్విక శివాని 64, శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి 79 స్థానాల్లో నిలిచారు.

  • Loading...

More Telugu News