: 'అంతా నీ సపోర్ట్ వల్లే, చెర్రీ!' అంటున్న ఉపాసన!


త‌మ త‌మ ప‌నుల్లో ఎప్పుడూ బిజీగా ఉండే న‌టుడు రామ్‌చ‌ర‌ణ్‌, ఆయ‌న భార్య ఉపాస‌న‌ల ప్రేమ‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిలుస్తోంది. ఇలా వారి భావాల్ని ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా చేర‌వేస్తుండ‌టం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఉపాస‌న ఫెమీనా ఉమెన్స్ అవార్డు అందుకున్నందుకు ఆమెను `ఉప్సీ` అని ప్రేమ‌గా పిలుస్తూ ఫేస్‌బుక్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ క్రంగాట్స్  చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కంగ్రాట్స్ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ ఉపాస‌న కూడా త‌న‌దైన శైలిలో రామ్‌చ‌ర‌ణ్‌ను పొగిడేసింది. `నీ స‌పోర్ట్ లేక‌పోతే ఇది సాధ్య‌మ‌య్యేది కాదు చెర్రీ` అంటూ భ‌ర్త‌కు బ‌దులిచ్చింది ఉపాస‌న‌. వీరి పోస్ట్‌లు చూసి నెటిజ‌న్లంతా `బెస్ట్ క‌పుల్ ఇన్ టాలీవుడ్` అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News