: `మామ్` తర్వాత శ్రీదేవి మరో సినిమా?
సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల సుందరి శ్రీదేవి మెల్లిగా జోరు పెంచుతోంది. కొత్త సినిమాలు ఒప్పుకునేందుకు ఆమె మొగ్గు చూపుతోంది. ఇంకా తాజా సినిమా `మామ్` విడుదలకాక ముందే శ్రీదేవి మరో సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. `ఆ కథ నాకు బాగా నచ్చింది. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది` అంటూ తాను చేయనున్న కొత్త సినిమా గురించి శ్రీదేవి చెప్పింది.
తాను ఒప్పుకున్న ప్రతి సినిమాను తన మొదటి సినిమాలాగే భావించే శ్రీదేవి ఇప్పటికి 300ల సినిమాల్లో నటించారు. `ప్రతి కథ నాకు కొత్తదే. అది నాకు మొదటిదే. నేను 300ల సినిమాల్లో నటించినంత మాత్రాన నేను అన్నీ చేయగలనని కాదు. ఏది చేసినా బాగా చేయడానికే ప్రయత్నిస్తుంటాను. అది మొదటి సినిమా అయినా లేదా 300వ సినిమా అయినా ఒకటే!`అని తెలిపారు శ్రీదేవి.