: ఆ మాట అనడానికి శిల్పా మోహన్ రెడ్డి ఎవరు?: భూమా అఖిలప్రియ ఫైర్


నంద్యాల ఉప ఎన్నిక వేడి పుట్టిస్తోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే మంత్రి భూమా అఖిలప్రియ, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిలు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు నంద్యాలలోని 6వ వార్డులో టీడీపీ ఆశీర్వాద యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డిపై అఖిలప్రియ నిప్పులు చెరిగారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి వారసుడు కాదని చెప్పడానికి మోహన్ రెడ్డి ఎవరని మండిపడ్డారు. బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి వారసుడేనని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. 

  • Loading...

More Telugu News