: మరోసారి రెచ్చిపోయిన చైనా సైన్యం... తీవ్ర హెచ్చరికలు పంపిన భారత్
సరిహద్దుల్లో చైనా మరోమారు రెచ్చిపోయింది. మరోసారి చొరబాటుకు ప్రయత్నిస్తూ, వందలాది మంది సైన్యాన్ని సరిహద్దులు దాటించగా, వారు భారత్ లోని డోక్లాం ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సైన్యం వారిని అడ్డుకుంది. ఆ వెంటనే సమస్య తీవ్రతను తెలుసుకున్న కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హద్దుల్లో ఉండాలని చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు పంపింది. భారత్ కు నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న భూటాన్ కూడా ఈ విషయంలో మద్దతు పలికింది. చైనా అక్రమంగా సరిహద్దులు దాటుతోందని ఆరోపిస్తూ, చైనా సైనికులను అడ్డుకునేందుకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రస్తుతం చైనా సైనికులు వెనక్కు వెళుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది.