: వంద కోట్లను కొల్లగొట్టిన 'దువ్వాడ జగన్నాథమ్'!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పలు వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. తొలివారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపాడు. "వంద కోట్ల సినిమా ఇచ్చిన సభ్య సమాజానికి శత కోటి వందనాలు" అంటూ ట్వీట్ చేశాడు. కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు. 

  • Loading...

More Telugu News