: ఐపీఎల్ డబ్బులతో ఒక కారు కొన్నా....మిగిలింది డబ్బు అలాగే ఉంది: బెన్ స్టోక్స్


ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (14.5 కోట్ల రూపాయలు). తాజాగా ఐపీఎల్ రెమ్యూనరేషన్ గురించి స్టోక్స్ మాట్లాడాడు. ఐపీఎల్ లో భారీ ధరకు కొనుగోలు చేయడంపై తాను కూడా ఆశ్చర్యపోయానని, దీనిపై పెద్ద చర్చ నడిచిందని అన్నాడు. అంత ధర పలకడంతో న్యాయం చేయగలనా? అని ఆలోచించానని, న్యాయం చేయాలని భావించానని, టోర్నీలో ఆడిన మ్యాచ్ లతో న్యాయం చేశానని భావిస్తున్నానని స్టోక్స్ తెలిపాడు. ఐపీఎల్ లో వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని వెచ్చించి కారు కొనుగోలు చేశానని చెప్పాడు. తనకు కార్లు అంటే చాలా ఇష్టమని, అందుకే కారు కొనుక్కున్నానని చెప్పాడు. మిగిలిన డబ్బు అలాగే ఉందని, దానిని ఇంకా ఏమీ చేయలేదని స్టోక్స్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News