: బుల్లితెరకి శ్రీదేవి చిన్నకూతురు.... కొద్దిలో మిస్....!
అందాల సుందరి శ్రీదేవి పెద్దకూతురు జాన్వి వెండితెర తెరంగేట్రం కంటే ముందే ఆమె చిన్న కూతురు ఖుషీ బుల్లితెరపై కనిపించడాన్ని అభిమానులు కొద్దిలో మిస్సయ్యారు. ఎలాగంటారా? ఇటీవల ముంబైలో జరిగిన `డ్యాన్స్ ప్లస్ 3` రియాలిటీ షో ఆడిషన్‌కు ఖుషీ వెళ్లింది. అందులో టాప్ 35 వరకు చేరుకుంది. ఈ లెవల్‌కు చేరుకునే వరకు ఆమె శ్రీదేవి కూతురనే విషయం ఎవరికీ తెలియనీయలేదు.
షో విధివిధానాల్లో భాగంగా టాప్ 35 కంటెస్టంట్స్ వారి పూర్తి వివరాలను షో నిర్వాహకులకు తెలియజేయాలి. దీంతో ఆమె శ్రీదేవి కూతురని బయటపడింది. తల్లి గుర్తింపు ఉపయోగించుకోకుండా ఈ స్థానం వరకు చేరుకున్నందుకు ఖుషీని అందరూ మెచ్చుకున్నారు. కాకపోతే టాప్ 12 వరకు చేరుకోలేకపోయినందుకు ఒకింత నిరుత్సాహపడ్డారు.