: అభిమానులపై అగ్రహం వ్యక్తం చేసిన నాని!


టాలీవుడ్ యువనటుడు నాని అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో నాని చురుగ్గా ఉంటాడు. సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాడు. అందరు హీరోల్లా నానికి కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారంతా నానిని అనుసరిస్తున్నారు. అలాంటి అభిమానుల్లో కొంతమంది 'నాని ఫనాటిక్' పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్నారు.

ఇందులో వచ్చే సరదా ట్వీట్లను నాని రీ ట్వీట్ కూడా చేస్తుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఈ పేజ్ నుంచి ఇతర హీరోలను విమర్శిస్తూ ట్వీట్లు వస్తున్నాయి. దీనిపై నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తోటి నటీనటులపై సెటైర్లు, విమర్శలు చేయడంపై మండిపడ్డ నాని, ‘మీరంతా నా అభిమానులని చెప్పుకుంటున్నారు. అందుకు ధన్యవాదాలు. కానీ మీరు ఇతరులపై చేస్తున్న ట్వీట్లను ఒకసారి గమనించండి. మీ భాష, తీరు మార్చుకోండి.. లేదంటే మీ ట్విటర్‌ ఖాతా పేరు.. ప్రొఫైల్‌ పిక్చర్‌ అయినా మార్చండి’ అంటూ ఘాటు సూచన చేశాడు. 

  • Loading...

More Telugu News