: ఈ పనులు చేయండి.. మీ స్మార్ట్ ఫోన్ వేగాన్ని పెంచుకోండి!
ఈరోజుల్లో గడియారానికి, మనుషులకి జరుగుతున్న పరుగుపందెంలో మనుషుల్ని గెలిపించడంలో కీలకపాత్ర పోషించేది స్మార్ట్ ఫోన్. అలాంటి స్మార్ట్‌ఫోన్ పనితీరు వేగం మందగిస్తే మనం ఓడిపోయినట్లే... మరీ ముఖ్యంగా అత్యవసర పని ఉన్నపుడు, బటన్ నొక్కిన చాలా సేపటి తర్వాత ఓపెన్ అయిందనుకోండి ఇక అంతే సంగతులు.. అందుకే ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ వేగాన్ని తగ్గకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి మీకోసం...
* ర్యామ్ మీద భారం తగ్గించండి : స్మార్ట్‌ఫోన్ వేగం అందులో ఉన్న ర్యామ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టోరేజ్ వివరాల్లోకి వెళ్లి ర్యామ్ మీద ఎంత భారం పడుతోందో తెలుసుకుని, ఎక్కువ ర్యామ్‌ను ఉపయోగించుకునే అప్లికేషన్లను గుర్తించి దానిపై భారాన్ని తగ్గించండి.
* క్యాచీ డేటాను క్లియర్ చేయండి : దాదాపు అన్ని రకాల అప్లికేషన్లు అవి పనిచేయడానికి కావలసిన కొన్ని ఫైళ్లను యూజర్‌కి తెలియకుండా డౌన్‌లోడ్ చేస్తాయి. దీన్ని క్యాచీ డేటా అంటారు. దీన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ వేగం పెరుగుతుంది.
* హంగులు, ఆర్భాటాలు వద్దు : హోం స్క్రీన్ అందంగా కనిపించడం కోసం ఎక్కువ గ్రాఫిక్స్, యానిమేషన్ ఉన్న వాల్‌పేపర్లు, స్క్రీన్ సేవర్లు డౌన్‌లోడ్ చేయడం మానుకోండి. వీలైనంత సింపుల్‌గా హోం స్క్రీన్ ఉండేలా చూసుకోండి. ఈ గ్రాఫిక్స్, యానిమేషన్ వల్ల ర్యామ్ మీద భారం పెరుగుతుంది.
* అవసరం లేనివి తీసేయండి : రోజూ అవసరమయ్యే అప్లికేషన్లను మాత్రమే ఉంచుకోండి. మిగతా వాటిని తీసేయండి. మళ్లీ కావాలనుకున్నపుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అప్లికేషన్ల వల్ల స్మార్ట్‌ఫోన్ వేగం మందగిస్తుంది.
* ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి : అప్‌డేటెడ్ అప్లికేషన్లను వాడటం వల్ల స్మార్ట్‌ఫోన్ వేగం పెరుగుతుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టంను కూడా అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
* క్లీనింగ్ అప్లికేషన్లు ఉపయోగించండి: పైన చెప్పిన పనులన్నీ ఎప్పటికప్పుడు మాన్యువల్ చేయకుండా ఉండేందుకు క్లీనింగ్ అప్లికేషన్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోండి.