: పవిత్ర సంగమంలో చంద్రబాబు పూజలు చేస్తున్న వేళ, కలకలం రేపిన పాము!


నిన్న కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించిన వేళ, ఓ పాము కలకలం రేపింది. సీఎం పూజలు చేయాల్సిన ఘాట్ లోనే నీటిలో కనిపించగా, భద్రతా సిబ్బంది కాసేపు కంగారు పడ్డారు. ఆపై పాము నీటిలోనే ఈదుకుంటూ వెళ్లింది. ఆ తరువాత చంద్రబాబు వచ్చి పూజలు నిర్వహించి వెళ్లిపోయారు.

ఇక, సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు మొబైల్ జామర్లను ఏర్పాటు చేయగా, దీని ప్రభావంతో ధ్వని వ్యవస్థకు యాంటీనాలకూ మధ్య సిగ్నల్స్ సైతం ఆగిపోయాయి. దీంతో సంగమం విశిష్టతను తెలుపుతూ తయారు చేసిన గీతాన్ని ప్లే చేసేటప్పుడు సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో జేసీ గంధం చంద్రుడు, దుర్గగుడి ఈఓ సూర్యకుమారిలు కాస్తంత ఆందోళన చెందారు. చివరకు జామర్లను ఆపి గీతాన్ని పునరుద్ధరించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News