: వనజాక్షి గీత దాటలేదు... తమ్మిలేరు ప్రాంతం ముసునూరు పరిధిలోకే వస్తుంది: ద్విసభ్య కమిటీ


గతంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి హద్దుమీరారంటూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆరోపించి, దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తడంతో, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ, ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ లతో కూడిన ద్విసభ్య కమిటీని ప్రభుత్వం విచారణకు నియమించింది. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు అందజేసింది.

ఈ నివేదికలో వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతోనే ఆమె మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో వెళ్లారని, అక్కడ అక్రమరవాణా కంటబడడంతో ఆమె అడ్డుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై దాడి చేశారని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

వనజాక్షి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు. చింతమనేని వాదన తప్పని వారు తేల్చి చెప్పారు. అలాగే వనజాక్షి పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఉండకూడదని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడింది. 

  • Loading...

More Telugu News