: టీమిండియా క్రికెటర్లు పాండ్యా, జడేజా తెగకొట్టేసుకుంటున్న యానిమేషన్ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది!


ఇటీవ‌ల ఇంగ్లండ్‌లో జ‌రిగిన‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌, భార‌త్ క్రికెట్ టీమ్‌లు త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ మ్యాచులో హార్ధిక్ పాండ్యా మిన‌హా టీమిండియా బ్యాట్స్ మెన్ అంతా ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఒంటరి పోరాటం చేసిన‌ హార్దిక్‌ పాండ్యా అవుటైన తీరు టీమిండియా అభిమానులను కూడా నిరాశ‌కు గురి చేసింది.

అద్భుతంగా రాణిస్తోన్న పాండ్యా 76 ప‌రుగుల వ్య‌క్తిగత స్కోరు వ‌ద్ద‌ సహచరుడు రవీంద్ర జడేజా (15)తో సమన్వయ లోపంతో రనౌట్‌ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో జడేజాపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో అరుస్తూ మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘ‌ట‌నే ఆధారంగా సరదాగా కొంద‌రు తీసిన ఓ యానిమేష‌న్‌ వీడియో క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. హార్డిక్‌ పాండ్యా, జడేజా మ్యాచ్‌ ముగిసినప్పటికీ తెగ‌కొట్టుకున్న‌ట్లు ఈ వీడియోను రూపొందించారు. ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన ఈ ఫైటింగ్‌ను చూడండి.
 

  • Loading...

More Telugu News