: కత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన దుండగుడు... అతడిని ప్రేమగా హత్తుకుని మార్చేసిన పోలీస్!


చేతిలో ఆయుధంతో ఉన్న దొంగ‌ని చూస్తే పోలీసులు ఏం చేస్తారు? ఆయుధాన్ని పారేసి లొంగిపొమ్మని అడుగుతారు.. లేదంటే కాళ్లపై కాల్చి నిరాయుధుడ్ని చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆత్మరక్షణార్థం ఒక్కోసారి కాల్చి పారేస్తారు.. అయితే, థాయిలాండ్‌లో అనిరుత్‌ మాలీ అనే పోలీసు అధికారి మాత్రం అద్భుతం చేశాడు. క‌త్తితో పోలీస్ స్టేష‌న్‌లోకి వ‌చ్చిన వ్య‌క్తిని ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. ఈ దృశ్యం అంతా అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి పలువురిని బెదిరించిన ఆ దుండ‌గుడిని పోలీసులు కాల్చేయాల‌నుకున్నారు. అయితే, అనిరుత్ అలా చేయ‌కూడ‌ద‌ని త‌న తోటి పోలీసుల‌కు చెప్పాడు. అనంత‌రం ఆ దుండ‌గుడికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

ఆ వ్యక్తిని కత్తిపక్కకు పడేసి తన దగ్గరకు రావాలని ఆ పోలీసు అధికారి కోరాడు. దీంతో ఆ వ్యక్తి త‌న వ‌ద్ద ఉన్న‌ కత్తిని ఆ పోలీసుకు ఇవ్వ‌బోయాడు. ఆ దుండ‌గుడి వ‌ద్ద‌కు వెళ్లిన ఆ పోలీసు అత‌డిని హ‌త్తుకున్నాడు. త‌న ప‌ట్ల ఆ పోలీసు చూపిన క‌రుణ‌కు ఆ దుండ‌గుడు క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆ దుండ‌గుడు గ‌తంలో ఓ సంగీతకారుడు. అతడి గిటార్‌ను ఎవరో కాజేయ‌డంతో అత‌డు చేసేది ఏమీ లేక కొన్నిరోజులుగా ఓ సెక్యూరిటీ గార్డుగా  ప‌ని చేస్తున్నాడు. అయితే, త‌న య‌జమాని త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బు ఇవ్వ‌క‌పోవ‌డంతో తీవ్ర‌ ఒత్తిడికి గురై ఓ కత్తిపట్టుకొని ఇలా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు.  

  • Loading...

More Telugu News