: ‘శమంతకమణి’ సెట్స్ లో చేపల కూర వండిన నారా రోహిత్!
ప్రముఖ హీరో నారా రోహిత్ కు కుకింగ్ చేయడమంటే ఇష్టమని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ లో ఖాళీ దొరికిన సమయంలో నారా రోహిత్ గరిటె పడుతుంటాడు. తాజాగా, తాను నటిస్తున్న ‘శమంతకమణి’ సెట్స్ లో చేపల కూర తయారు చేశాడు. ఓ పెద్ద గిన్నె నిండా ఈ కూర వండాడు. తాను తయారు చేసిన కూర రుచి చూస్తున్న ఫొటో, ఈ సినిమాలో నటిస్తున్న హాస్య నటుడు రఘు ఆ కూర గిన్నెను దించుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మల్టీ స్టారర్ చిత్రంలో నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు, అనన్య సోని, చాందినీ చౌదరి, కీలకపాత్రలో రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.