: మోదీని చూసి స్ఫూర్తి పొంది ఇలా చేస్తున్నా: క్రికెటర్ జడేజా


‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైకిల్‌ తొక్కుతున్న ఫొటో’ను స్ఫూర్తిగా తీసుకున్న టీమిండియా క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా తాను కూడా సైకిల్ తొక్కాడు. ఈ విష‌యాన్ని జ‌డేజా త‌న ట్విట్ట‌ర్ ఖాతాద్వారా తెలిపాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం నెదర్లాండ్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే.

 ఈ సంద‌ర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్‌ రుట్టే... మోదీకి ఓ సైకిల్‌ను గిఫ్టుగా ఇచ్చారు. మోదీ ఆ సైకిల్‌పై ఎక్కి కూర్చున్న ఫొటోని రుట్టే త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా అది అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ ఫొటోను చూసే తాను స్ఫూర్తి పొందాన‌ని తెలుపుతూ తాను సైకిల్‌ రైడ్‌ చేస్తున్న ఫొటో, మోదీ సైకిల్‌పై ఉన్న ఫొటోను క‌లిపి జ‌డేజా పోస్ట్ చేశాడు. మోదీకి తాను థ్యాంక్స్  చెబుతున్నాన‌ని, ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఆయ‌న‌ స్ఫూర్తి అని జడేజా అన్నాడు.  

  • Loading...

More Telugu News