: టికెట్ క్యాన్సిలేషన్ లతో రైల్వేకు భారీ ఆదాయం!


ప్రయాణ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం సహజమే. కొన్ని కారణాల రీత్యా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని, టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కూడా సాధారణ అంశమే. అయితే, ఈ టికెట్ క్యాన్సిలేషన్లు రైల్వేకు కాసుల పంట పండిస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్ల వల్ల రైల్వేకు ఏకంగా రూ. 1,407 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25.29 శాతం ఎక్కువ.  

  • Loading...

More Telugu News