: కేసీఆర్ కు 70, చంద్రబాబుకు జీరో మార్కులే వేస్తాను!: నాదెండ్ల భాస్కరరావు


తెలుగు ప్రజలను పరిపాలించడంలో కేసీఆర్ కు తాను 70 మార్కులు వేస్తానని, చంద్రబాబుకు వేసేది మాత్రం సున్నా మార్కులేనని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిందేమీ లేదని, పెద్ద కమ్మ, గుంటూరు,. విజయవాడ మధ్య అతిపెద్ద జమిందారు రాజా వాసిరెడ్డి వెంటటాద్రి నాయుడి ఆస్తులను, భూములను కొట్టేయడానికే రాజధానిని ఆ ప్రాంతంలో పెట్టి 'అమరావతి' అని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆయన తన రాజధానిని అచ్చిరావడం లేదన్న కారణంతో చింతపల్లిలో పెట్టుకున్నారని, ఇప్పటికీ అమరావతిలో వారి భూములు ఉన్నాయని అన్నారు.

అసలు విజయవాడ నుంచి అమరావతికి ఎలా వెళ్తారని ప్రశ్నించిన ఆయన, అక్కడి భూములన్నీ మెత్తటివని, ఏం కట్టినా నిలవవని అన్నారు. అందుకే తాను జగత్ జంత్రీ అని చంద్రబాబును అంటానని అన్నారు. చంద్రబాబు పాలన గురించి మాట్లాడేంత తెలివి తక్కువ వ్యక్తిని కాదని అన్నారు. తాను నెల రోజుల సీఎంనే అయినా, బాబు 13 ఏళ్లు సీఎంగా ఉన్నా ఫర్వాలేదని, బంగారం శివుడి నెత్తిన ఉన్నా, పాతాళంలో ఉన్నా ఒకటేనని, తన విలువ మారబోదని అన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు డైరెక్టుగా ఇన్ వాల్వ్ అయి వున్నారని, ఆయనే దీనికి బాధ్యత వహించాల్సి వుంటుందని, నేడు కాకున్నా, ఏదో ఒక రోజు కోర్టుకు, జైలుకు పోవాల్సిందేనని ఆయన జోస్యం చెప్పారు. తన ఇంట్లో సంసారం నడుపుకోవాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేంద్రం నుంచి తీసుకుని, కాంట్రాక్టులు ఈయన ఇస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News