: ఉద్యమ సమయం నాటి కేసులను కేంద్ర ప్రభుత్వం ఎత్తేయదా?: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులు నేడు సికింద్రాబాద్ లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న రోజుల్లో టీఆర్ఎస్ తరపున చేపట్టిన రైల్ రోకోలో వీరు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, వీరిపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన కోర్టు విచారణకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసిందని... మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తేయదా? అంటూ ట్విట్టర్లో ఆయన ప్రశ్నించారు.