: చైనాతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిక్కింలో పర్యటించనున్న ఆర్మీ చీఫ్


ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సిక్కింలో నేడు పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఇండో-చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కింలోని ఆర్మీకి సంబంధించిన పలు విషయాలను ఆయన దగ్గరుండి పరిశీలించనున్నారు. చైనాతో తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదం సమయంలో ఈ పర్యటన కొనసాగుతుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

మరోవైపు సిక్కిం సెక్టార్ లో భారత సైనికులు సరిహద్దులు దాటి చైనా భూభాగంలోకి వస్తున్నారని... ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చైనా డిమాండ్ చేస్తోంది. తమ భూభాగంలో ఉన్న డోంగ్లాంగ్ రీజియన్ లో తాము రోడ్డును నిర్మిస్తుండటాన్ని కూడా భారత సైనికులు అడ్డుకుంటున్నారని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సిక్కింలో ఆర్మీ చీఫ్ పర్యటనను చైనా నిరసించే అవకాశాలు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News