: జూరాల నిండుకుండ... నేడో, రేపో గేట్ల ఎత్తివేతతో శ్రీశైలానికి పరుగులిడనున్న కృష్ణమ్మ


కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలకు జూరాలకు భారీగా వరదనీరు చేరుతోంది. 9.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ఇప్పటికే 7.5 టీఎంసీల నీరు చేరుకుంది. ఈ ఉదయం 2,775 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 757 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ లో నీరు 8.5 టీఎంసీలు దాటగానే నీటిని దిగువకు విడిచే అవకాశాలు ఉన్నాయి. నేడు లేదా రేపు ప్రాజెక్టు గేట్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జూరాలలో వదిలిన నీరు ప్రస్తుతం ఏ మాత్రం ఇన్ ఫ్లో నమోదు కాని శ్రీశైలానికి రానుంది. 885 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం కేవలం 20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక కృష్ణా బేసిన్ లోని ఆల్మట్టిలోకి 1,366 క్యూసెక్కులు, తుంగభద్రకు 1,564 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

  • Loading...

More Telugu News