: బ్యూటీషియన్ శిరీష కేసులో కొత్త ట్విస్ట్... ఆమెపై లైంగిక దాడి జరగలేదు: ఫోరెన్సిక్ రిపోర్ట్
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషపై కేసు సస్పెన్స్ ధ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ కేసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పుటేజ్ లభ్యం కాలేదు. అంతే కాకుండా శిరీష కుటుంబ సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో శిరీషది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ రిపోర్టు రావాలని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆమెపై లైంగిక దాడి జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టులో స్పెర్మొటోజ కనిపించలేదని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. శిరీషపై ఆత్యాచారం జరగని పక్షంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇరు పక్షాల ముందు అనుమానం రేపుతోంది. అయితే ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టుకి, ఫైనల్ రిపోర్టుకి వ్యత్యాసం ఉంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.