: రామ్‌గోపాల్ వర్మకు షాకిచ్చిన ముంబై కోర్టు.. సమన్లు జారీ!


ప్రముఖ దర్శకనిర్మాత రామ్‌గోపాల్ వర్మకు ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. వినాయకుడిపై ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సమన్లు జారీ చేసింది. ఆగస్టు 8వ తేదీలోపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ‘అవయవాలే సరిగా లేని వినాయకుడు తన భక్తుల బాధలు తొలగిస్తాడట.. విచిత్రంగా ఉంది’ అంటూ రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఆక్షేపించాడు. దీనిపై 2014లో ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ శెట్టి ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. దీనిని విచారించిన కోర్టు ఆర్జీవీకి సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News