: ఫిట్‌గా ఉంటారా? ఇంటికెళ్తారా?.. శ్రీలంక క్రికెటర్లకు ప్రభుత్వం వార్నింగ్!
శ్రీలంక క్రికెటర్లకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఫిట్‌గా ఉంటారో, ఇంటికెళ్తారో ఏదో ఒకటి నిర్ణయించుకోమని అల్టిమేటం జారీ చేసింది. ఇందుకోసం మూడు నెలల గడువు ఇచ్చింది. రేపటి (శుక్రవారం) నుంచి జింబాబ్వేతో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడాన్ని గమనించిన ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం జట్టు సభ్యుల్లో ఒక్కరు కూడా ఫిట్‌గా లేరని, అయితే ఈసారికి వారికి మినహాయింపు ఇస్తున్నట్టు క్రీడా శాఖా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు.
వివాదాస్పద బౌలర్ లసిత్ మలింగ 80 కేజీల బరువు ఉండడం, ఫిట్నెస్ టెస్ట్ ఫెయిలవడంతో అతడిని అబ్జర్వేషన్లో పెట్టారు. కాగా, ఇటీవల మంత్రి జయశేఖరను ‘కోతి’గా అభివర్ణించిన మలింగకు రేపటి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అలాగే ఆరు నెలలపాటు మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించారు. మంత్రిని దూషించిన అతడిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.